కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర ఘటన !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయానికి రాహుల్ వచ్చేసరికి సోనియా గాంధీ మరో సీనియర్ నేత అంబిక సోనీతో మాట్టాడుతున్నారు. రాహుల్ వచ్చిన వెంటనే సోనియా రాహుల్‌ను చూపిస్తూ అంబికాతో నవ్వుతూ ఏదో చెబుతుండగా రాహుల్ తల్లి సోనియా గడ్డం పట్టుకుని బుజ్జగించారు. ఈ సన్నివేశం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ జోడో యాత్ర  మొదలైనప్పటి నుంచి టీ-షర్టులోనే కనిపిస్తున్న రాహుల్... కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కూడా టీ-షర్టు లోనే కనిపించారు. ఇవాళ కూడా టీ-షర్టులోనే కనిపిస్తున్నారంటూ ఓ మీడియా  అడిగిన ప్రశ్నకు రాహుల్ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. 'నడిచినంత కాలం నడవనివ్వండి' అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు. మోడీ ని బీజేపీ చాయ్ వాలాగా అభివర్ణిస్తుంటుంది. చాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారంటూ చెబుతుంటుంది. అందుకే రాహుల్ డెఫ్త్‌గా సెటైర్ వేశారంటూ చలోక్తులు విసురుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)