పుట్టినరోజే మృత్యు ఒడిలోకి...!

Telugu Lo Computer
0


అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో విలియం క్లే (56) అనే వ్యక్తి బర్త్‌డే డిసెంబర్ 24న. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ బీభీత్సం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి విలియం వెళ్లాడు. చాలాసేపైనా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు కూడా దీన్ని ధృవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు.  మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా (దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)