కన్వెన్షన్‌ హాల్‌గా మారిన పంచాయతీరాజ్‌ అతిథిగృహం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా గురజాలలో పంచాయతీరాజ్‌ అతిథి గృహం భవనానికి పల్నాడు కన్వెన్షన్‌ హాల్‌ పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు. పట్టణంలో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని ఇటీవల ప్రారంభించారు. నెలకు రూ.28 వేల అద్దె కింద ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలోకి వెళ్లింది. 2016 జులై 29న అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 1.35 కోట్లతో పంచాయతీ అతిథిగృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి మూడో తేదీన భవనాన్ని ప్రారంభించారు. ఫర్నిచర్‌ లేకపోవడంతో ఉపయోగంలోకి రాలేదు. ఇందుకు ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి రూ.30 లక్షలు కేటాయించి 2022 ఆగస్టు 12న ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాల విక్రయం, లీజుకు ఇవ్వడం, భవనాలను అద్దెలకు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై పంచాయతీరాజ్‌ శాఖ గురజాల డీఈ ముత్తయ్యను సంప్రదించగా అతిథిగృహాన్ని మూడేళ్ల పాటు నిర్వహణ చేసుకుని తిరిగి అదేవిధంగా అప్పగించే ప్రాతిపదికన నెలకు రూ.28 వేలు అద్దె చెల్లించేలా ఒక వ్యక్తికి అప్పగించామని తెలిపారు. రెండు సూట్‌లు, రెండు సమావేశ మందిరాలు, అద్దెకు, కార్యక్రమాలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగించాలని సూచించామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)