ప్రియుడుతో పరారై, శవమైంది.... ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 13 December 2022

ప్రియుడుతో పరారై, శవమైంది.... !


కర్ణాటకలోని హాసన్‌ జిల్లా పరసనహళ్లికి చెందిన కావ్యకు హానన్‌కు చెందిన యువకుడితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిపించారు. అయితే కావ్యకు వివాహం కన్నా ముందే అవినాష్‌ అనే యువకుడిని ప్రేమించింది. కానీ కావ్యకు వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. వివాహమైన నాలుగు నెలలకే ప్రియుడు దగ్గరకు వెళ్లింది. అతడితో కలిసి జీవించసాగింది. పుట్టింటి వారు కాల్‌ చేస్తే సరిగా మాట్లాడేది కాదు. ఇక అవినాష్‌.. ఏ పని పాటా లేకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం కావ్య తల్లిదండ్రులు ఆమెకు కాల్‌ చేశారు. అప్పుడు కావ్య.. తాను బెంగళూరులో పని చేసుకుంటూ.. అక్కడే ఉన్న ఓ హాస్టల్లో ఉంటున్నాని అబద్ధం చెప్పింది. కొన్ని రోజుల క్రితం అవినాష్‌ హొళెనరసీపుర తహసీల్దార్‌, పోలీసులను కలిసి కావ్య మృతి చెందిందని.. ఆమె మృతదేహం చెరకు తోటలో పడి ఉందని వారికి తెలిపాడు. పోలీసులు అవినాష్‌.. చెప్పిన ప్రాంతానికి వెళ్లి.. చూడగా.. అక్కడ కావ్య మృతదేహం కనిపించింది. పోలీసులు కావ్య డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం చేశారు. ఈ విషయాన్ని కావ్య తల్లిదండ్రులకు తెలియజేశారు. కావ్య మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు తన కుమార్తెని అవినాష్‌ హత్య చేసి ఉంటాడన్న అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అవినాష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment