మోడీ సర్కార్‌పై భరోసా వద్దు !

Telugu Lo Computer
0


గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మోదీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు విసురుతున్నారు. నిరుద్యోగాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకుని మోదీపై దాడి చేస్తున్నారు. బీజేపీ ఆధిక్యం చూపే ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. మంగళవారం రాత్రి డానిలిమ్డా అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఒవైసీ ప్రసంగిస్తూ  మెదీపై జోకులు పేల్చారు. 'ఇటీవల ఓ వ్యక్తిని కలిసి గుజరాత్‌లో పరిస్థితి ఎలా ఉన్నదని ప్రశ్నించాను. ఆయన ప్రస్తుత పరిస్థితిని జోక్‌ ద్వారా చెప్పాడు. ఓ అమ్మాయి తనతో ప్రేమలో ఉన్న అబ్బాయితో నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడొస్తుంది.. మా ఇంట్లో మరో సంబంధం చూస్తున్నారు.. అని చెప్పింది. దానికి ఆ అబ్బాయి.. మోదీ సర్కార్‌పై భరోసా వద్దు.. హాయిగా పెండ్లి చేస్కో.. అంటూ జవాబిచ్చాడు. ఇలా ఉంది మన ప్రధాని మోదీ తీరు..' అంటూ ఒవైసీ జోక్‌ వేయడంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్ధానం చేసిన మోదీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారని ఒవైసీ దుయ్యబట్టారు. 2024 లోగా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానంటూ.. ఓట్లు రాబట్టేందుకు ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)