ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ లోని  శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆదినారాయణ అనే టీచర్ గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తరువాత యధావిధిగా తన విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్ లో హాజరు వేయబోయారు. కానీ సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటో ఒకేలా లేకపోవడంతో, ఆ యాప్.. నుంచి ఊహించిన సమాధానం వచ్చింది. ఈ మొహం నీది కాదంటూ రిజెక్ట్ చేసింది. దీంతో ఆ టీచర్  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ సంఘటనపై మీడియాలో పలు కథనాలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయింది. ప్రభుత్వంపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. టీచర్ ఆదినారాయణకు ఈ నెల 17న మెమో జారీచేశారు. దీనికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఆ వివరాలను పత్రికలకు తాము లీక్ చేయలేదని విన్నవించుకున్నారు. అయినా ఆదినారాయణను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఉన్నతాధికారులతో చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ మీడియాకు చెప్పడం ఏంటంటూ అధికారులు సీరియస్ అయ్యారు. లేటెస్ట్‌గా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీఈవో మీనాక్షి. యాప్‌లోని లోపాలను సరిచేయకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)