బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి హై ఈఎంఐ స్కీమ్‌ !

Telugu Lo Computer
0


బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్  హై ఈఎంఐ స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా హోమ్ లోన్ తీసుకున్న వారు తక్కువ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మై ఈఎంఐ ఆప్షన్ కింద రుణ గ్రహీతలు తొలి నాళ్లలో తక్కువ ఈఎంఐ చెల్లించొచ్చు. హోమ్ లోన్ అమౌంట్‌లో 0.1 శాతం మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు.  కనీస నెలవారీ ఈఎంఐ రూ. 4,999 నుంచి ప్రారంభం అవుతుందని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ మై ఈఎంఐ ఆప్షన్‌ను మూడేళ్ల వరకు పొందొచ్చు. తీసుకున్న హోమ్ లోన్‌పై రెగ్యులర్ ఈఎంఐ ఈ మూడేళ్లు పూర్తి అయిన తర్వాత ప్రారంభం అవుతుంది. అంటే ఇంటి కొనుగోలుదారలు తొలినాళ్లలో ఎక్కువగా చెల్లించాల్సిన పని లేకుండానే నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చు. దీని వల్ల తక్కువ ఈఎంఐ మొత్తంతో సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఇంటి కోసం రూ. 50 లక్షలు లోన్ తీసుకొని ఉంటే మీరు 0.1 శాతం మొత్తాన్ని ఈఎంఐ రూపంలో కట్టాల్సి వస్తుంది. అంటే నెలకు రూ. 5 వేలు ఈఎంఐ పడుతుంది. ఇలా తొలి మూడేళ్ల పాటు రూ. 5 వేలు ఈఎంఐ కట్టాలి. తర్వాతి నుంచి రెగ్యులర్ ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో కొత్త ప్లాట్ లేదా ఇంటికి బుక్ చేసుకోవాలని భావించే కస్టమర్లకు ఈ ఆఫర్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ తరహా రుణాన్ని పొందొచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.2 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 5 వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. రుణ గ్రహీతలు వారి లోన్ వడ్డీ రేటును రెపో రేటు వంటి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో లింక్ చేసుకోవచ్చు. దేశంలోని దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా 5.8 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. ఈ ఆఫర్ పొందాలని భావించే వారు ఒక విషయం గుర్తించుకోవాలి. హోమ్ లోన్ ఈఎంఐని ఎంత త్వరగా చెల్లిస్తే అంత మంచిది. ఆలస్యం చేసే కొద్ది వడ్డీ భారం పెరిగిపోతుంది. అందువల్ల మీరు మై ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే ముందు మొత్తగా ఎంత వడ్డీ పడుతుందో చెక్ చేసుకోండి.

Post a Comment

0Comments

Post a Comment (0)