మన్‌కీ బాత్‌లో సిరిసిల్ల నేతన్నకు ప్రశంసలు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 27 November 2022

మన్‌కీ బాత్‌లో సిరిసిల్ల నేతన్నకు ప్రశంసలు


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడిపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం  రేడియో కార్యక్రమం ''మన్ కీ బాత్'' 95వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని సిరిసిల్ల నేతన్న గురించి ప్రస్తావించారు. సిరిసిల్ల చేనేత వస్త్రం, చేనేత కార్మికుల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జీ-20 పేరుతో హరిప్రసాద్ అనే చేనేత కార్మికుడు తన చేతితో స్వయంగా నేసిన వస్త్రాన్ని చూపిస్తూ.. చేనేత కార్మికుల గొప్పదనం, కళా నైపుణ్యాన్ని కొనియాడుతూ వారిని అభినందించారు. హరిప్రసాద్‌ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందన్నారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన హరిప్రసాద్‌ చేనేత కళకు మెరుగులు దిద్దారని ప్రశంసించారు. తనకు పంపిన లేఖలో హరిప్రసాద్ చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలు పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో వెల్లడించారని గుర్తు చేశారు.

No comments:

Post a Comment