పెన్షనర్లే లక్ష్యంగా సైబర్ మోసాలు !

Telugu Lo Computer
0


సైబర్ నేరాలపై అవగాహన లేని పెన్షనర్లని  సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. వారి డేటాని పొంది, సర్టిఫికెట్ వివరాలు చెప్పాలంటూ సైబర్ మోసగాళ్లు పెన్షనర్లకు కాల్స్ చేస్తున్నారని, మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పెన్షనర్లను సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ కార్యాలయం హెచ్చరిస్తుంది. పెన్షన్ డిపార్ట్‌మెంట్ నుండి కాల్ చేస్తున్నామని, లైఫ్ సర్టిఫికేట్‌ను అప్‌డేట్ చేయడానికి ఓటీపీని చెప్పాలని మోసగాళ్లు పెన్షనర్‌లకు కాల్స్ చేశారని పేర్కొన్నారు. ఇక పెన్షనర్ల నుండి OTP పొందిన తర్వాత, మోసగాళ్ళు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా యాక్సెస్ పొందుతారని, దాంతో పెన్షనర్ల ఖాతా నుండి మొత్తాన్ని తమ మోసపూరిత ఖాతాకు బదిలీ చేసేస్తారని అధికారులని సైతం  ప్రభుత్వం అలెర్ట్ చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)