మహిళా శక్తికి నా సెల్యూట్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 November 2022

మహిళా శక్తికి నా సెల్యూట్


ఆనంద్ మహీంద్రా ట్రెండ్ ను, న్యూస్ ను బాగా ఫాలో అవుతారు.  కనీసం వారానికి ఒక ట్వీట్ అయినా పెడతారు. ఈయన ట్వీట్స్  వైరల్ కూడా అవుతుంటుంది.  తాజాగా ఆనంద్ మహీంద్రా పెట్టిన ట్వీట్ మళ్ళీ వైరల్ అయింది. ఏవియేషన్ రంగంలో ఉన్న భారత మహిళల గురించి ట్వీట్ చేశారు. భారత్ అత్యంత వేగంగా డెవలప్ అవుతోంది. ఆర్ధిక వ్యవస్థతో పాటూ ఇతర రంగాల్లోనూ కొత్త శిఖరాలను అందుకుంటోంది. అలాంటి రంగాలలో ఏవియేషన్ ఒకటి. ఇందులో మహిళల వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చాలా బావున్నాయి. అందులోనూ భారత్ నుంచి వాణిజ్య మహిళా పైలట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఘనత సాధించిన మహిళా శక్తికి నా సెల్యూట్ అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. "భారత మహిళా శక్తికి సెల్యూట్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. వీకెండ్ జోష్ కోసం సెర్చ్ చేస్తున్నారా? హలో వరల్డ్ , నారీ శక్తి సనిలో ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ తో పాటూ అందరూ భారత మహిళలను పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో వుమెన్ పైలట్లు సంఖ్య 12.4 శాతం ఎక్కువగా ఉంది. #Midweek momentum అని క్యాపన్ష్ పెట్టి ఈ లెక్కలను ట్వీట్ చేశారు. భారత్ తర్వాత 9.9 శాతంతో ఐర్లాండ్, 9.8% తో దక్షిణాఫ్రికా, 7.5% ఆస్ట్రేలియా, 7.0% కెనడా, 6.9% జర్మనీ, 5.5% అమెరికా, 4.7% యుకె, 4.5% న్యూజిలాండ్, 1.3% జపాన్ వరుసగా ఉన్నాయి.

No comments:

Post a Comment