తొలి దశ బరిలో 21% మంది నేర చరితులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 November 2022

తొలి దశ బరిలో 21% మంది నేర చరితులు !


గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21% మంది క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు. 13 శాతం మందిపై  తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. తొలి దశలో 89 సీట్లకు ఎన్నికలు జరగుతుండగా, మొత్తం 788 మంది బరిలో ఉన్నారు. వీరిలో 167 మందిపై క్రిమినల్​ కేసులు ఉండగా అందులో 100 మందికిపైగా హత్య, రేప్​ వంటి క్రిమినల్​ నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. అసోసియేషన్​ ఫర్​ డెమొక్రాటిక్​ రిఫామ్స్ (ఏడీఆర్) గురువారం విడుదల చేసిన రిపోర్ట్​ ఈ విషయాలను వెల్లడించింది. ప్రధాన పార్టీల విషయానికి వస్తే ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి ఎక్కువ మంది నేర చరితులు బరిలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. 89 సీట్లకుగానూ 88 చోట్ల ఆప్​ పోటీ చేస్తోంది. ఇందులో 39 % మంది అభ్యర్థులపై క్రిమినల్​ కేసులున్నాయి. 30% మందిపై హత్య, రేప్, కిడ్నాప్, దాడి తదితర నేరారోపణలు ఉన్నాయి. ఆప్​ బరిలో నిలిపిన అభ్యర్థుల్లో 32 మంది క్రిమినల్​ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆప్​ తర్వాత కాంగ్రెస్​ పార్టీ ఎక్కువమంది నేరచరితులను బరిలో దించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 35% మంది క్రిమినల్​ కేసులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ మొత్తం89 సీట్లలో పోటీ చేస్తుండగా.. 31 మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ఇక అధికార బీజేపీ 16 శాతం మంది నేరచరితులను బరిలో దించింది. బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుండా, 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 12 మందిపై సీరియస్​ క్రిమినల్​ కేసులు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 15 శాతం మంది మాత్రమే క్రిమినల్​ కేసులు ఉన్న వారు పోటీ చేశారు. అయితే ఇప్పుడు భారీగా పెరిగింది. ఎన్నికల కమిషన్​కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్ విడుదల చేసింది.

No comments:

Post a Comment