మోకాలి శస్త్ర చికిత్స వికటించడంతో క్రీడాకారిణి మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 November 2022

మోకాలి శస్త్ర చికిత్స వికటించడంతో క్రీడాకారిణి మృతి


చెన్నై వ్యాసర్పాడికి చెందిన క్రీడాకారిణి ఆర్‌.ప్రియ(17) కుడికాలికి గాయం కావడంతో పెరియార్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆర్థ్రోస్కోపీ ద్వారా మోకాలిలోని అతిక్లిష్టమైన లిగమెంట్‌ టేర్‌కు ఈనెల 7న వైద్యులు శస్త్రచికిత్స చేశారు. రక్త ప్రసరణ నియంత్రణకు తొడభాగంలో ఉంచిన టోర్నీక్వెట్‌ను 20 గంటలపాటు తొలగించకపోయేసరికి కుడికాలిలో రక్తం గడ్డకట్టింది. పరిస్థితి విషమించగా ప్రియను రాజీవ్‌గాంధీ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు 9న కాలు తొలగించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు కాకపోవడంతో 14న మరో శస్త్రచికిత్స చేశారు. పరిస్థితి మరింత విషమించి అవయవాలన్నీ పనిచేయక మరుసటిరోజు ప్రియ చనిపోయారు. బాధితురాలి ఇంటికి వెళ్లిన సీఎం స్టాలిన్‌ కుటుంబసభ్యులను పరామర్శించి, రూ.10 లక్షలను పరిహారంగా అందించారు.

No comments:

Post a Comment