అత్యాచార నిందితుడికి ఐదు గుంజీల శిక్ష ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 November 2022

అత్యాచార నిందితుడికి ఐదు గుంజీల శిక్ష !


బీహార్‌లోని నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో అరుణ్‌ పండిట్‌ అనే వ్యక్తి కోళ్లఫారంలో పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశజూపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా, కోళ్లఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోవాలని సూచించాడు. పంచాయతీ పెద్దలు నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి, అతడిని విడిచి పెట్టారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ పంచాయతీ తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment