టీ20 మ్యాచ్‌లో న్యూజీలాండ్ పై భారత్ గెలుపు

Telugu Lo Computer
0


న్యూజీలాండ్, భారత్ జట్ల మధ్య మౌంట్ మౌంగనూయిలో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 66 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్య కుమార్ యాదవ్ 51 బంతుల్లో 7 సిక్స్‌లు, 11 ఫోర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 36 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 పరుగులు, రిషభ్ పంత్ 6 పరుగులు చేశారు. న్యూజీలాండ్ బౌలర్ టిమ్ సౌథీ చివరి ఓవర్‌లో 3, 4, 5 బంతుల్లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. 192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు 18.5 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 52 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఓపెనర్ డెవోన్ కాన్వే 25, క్లెన్ ఫిలిప్స్ 12, డారిల్ మిచెల్ 10 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో నలుగురు సింగిల్ డిజిట్‌కే ఔటవ్వగా, ముగ్గురు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో దీపక్ హుడా కొద్దిలో హ్యాట్రిక్ అవకాశం కోల్పోయాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీశాడు. యజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ చెరొక వికెట్ తీశారు. సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)