2026 నాటికి బుల్లెట్ ట్రైన్ !

Telugu Lo Computer
0


దేశంలో 2026 నాటికి బుల్లెట్ రైళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. భారతదేశంలో 2025 నాటికి 475 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతామని మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. మూడేళ్లలో 475 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామన్నారు. దేశంలో 138 స్టేషన్లకు మాస్టర్‌ప్లాన్లు రూపొందించామని, 57 స్టేషన్లకు డిజైన్లు ఖరారు చేశామన్నారు.వందే భారత్ రైళ్లు అనేక దేశాలలో ఆసక్తిని రేకెత్తించాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తాము 110 కిలోమీటర్ల రైలు ట్రాక్ నిర్మించామని, భారతీయ వాతావరణానికి అనుగుణంగా జపాన్ మోడల్‌లో డిజైన్ మార్పులను జోడించడానికి కొంత సమయం పడుతోందని మంత్రి వైష్ణవ్ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)