మాయ మాటలతో దోపిడీ

Telugu Lo Computer
0


బెంగుళూరు ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న మోహన్ దాస్, ధనుష్య  సులువుగా, తెలివిగా డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచలను చేశారు. ఇందు కోసం అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు పోగు చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే ధనుష్య గతంలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లి నా భర్త ఎయిర్ పోర్టు కస్టమ్స్ లో పని చేస్తాడని, జప్తు చేసి ఉంచిన బంగారాన్ని తక్కువ ధరకు తీసుకొస్తాడని మాయ మాటలు వల్లించింది. ఇలా ధనుష్య మాయలో పడిన స్నేహ దాదాపుగా రూ.68 లక్షల వరకు  ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ దంపతులు ఇంతటితో ఆగకుండా అకాడమీలో పని చేస్తున్న ఉద్యోగులను సైతం నమ్మించి వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బును కాజేశారు. కొన్ని రోజుల తరువాత స్నేహ ధనుష్యకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన స్నేహ, అకాడమిలో ఉద్యోగులు అంతా కలిసి వారి కోసం కొన్ని రోజులు వేచి చూశారు. దనుష్య దంపతుల నుంచి ఎలాంటి స్పందన రాకపొయ్యే సరికి స్నేహ, అకాడమీ ఉద్యోగులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులను ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి సుమారుగా 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)