శివ్ నాడార్ దాతృత్వం !

Telugu Lo Computer
0


పారిశ్రామికవేత్త, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ. 1,161 కోట్ల వార్షిక విరాళంతో దేశంలో అత్యంత ఉదారుడుగా నిలిచారని ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 తెలిపింది. శివ్ నాడార్, ఆయన కుటుంబం రోజుకు రూ.3 కోట్లకు పైగా ప్రజలకు విరాళంగా అందిస్తున్నట్టు తెలిసింది. 'క్రియేటివ్ ఫిలాంత్రఫీ' అనే ఉద్దేశ్యంతో శివ్ నాడార్ ఫౌండేషన్ ను 1994లో ఏర్పాటు చేశారు. శివ్ నాడార్ కుటుంబం ఎక్కువగా దేశంలో విద్యావ్యాప్తికి కృషి చేస్తుంది. ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థలకి, విద్యా జ్ఞాన్, శివ్ నాడార్ యూనివర్సిటీ, శివ్ నాడార్ స్కూల్, శిక్షా ఇనీషియేటివ్, కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వంటి వాటికే శివ్ నాడార్ కంట్రిబ్యూషన్లు ఎక్కువగా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)