ఇద్దరు యువతుల నరబలి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 11 October 2022

ఇద్దరు యువతుల నరబలి !


కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిన నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు కోసం ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. వీరిద్దరు కేరళలోని కడవంతర, కాలడి నివాసితులు. వీరిలో ఒకరు ఈ ఏడాది జూన్ లో కనిపించకుండాపోగా, మరో మహిళ సెప్టెంబర్ నుంచి అదృశ్యం అయింది. వీరిద్దరిని గొంతు కోసి, శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు భగవల్ సింగ్, లైలా తిరువల్ల నివాసితులు కాగా, షఫీ పెరుంబవూర్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు భగవల్ సింగ్ దంపతుల ఇంటికి హత్యగావించబడ్డ యువతులను షఫీనే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment