అభిషేక్ రావు సీబీఐ కస్టడీ పొడిగింపు

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడిగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం విధించిన మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆయనను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అభిషేక్ సీబీఐ కస్టడీని పొడగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీలో అభిషేక్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని, మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. అందుకే ఆయన కస్టడీ మరో రెండు రోజులు పొడగించాలని అధికారులు కోర్టును అభ్యర్థించారు. అయితే అభిషేక్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీ పొడగింపు పిటిషన్ను వ్యతిరేకించారు. రెండ్రోలుగా సీబీఐ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని అందుకే కస్టడీ పొడగించవద్దని, దర్యాప్తునకు అభిషేక్ పూర్తిగా సహకరిస్తారని న్యాయమూర్తికి విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి సీబీఐ అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల పాటు కస్టడీ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)