ఉక్రెయిన్ నాటోలో చేరితే మూడో ప్రపంచ యుద్ధమే !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ ను  నాటో కూటమిలో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. గత నెల సెప్టెంబర్ 30న రష్యా ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని రష్యా తనలో కలుపుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ప్రజాభిప్రాయం ప్రకారం రష్యాలో విలీనం అయ్యాయి. ఈ పరిణామం జరిగిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలన్ స్కీ నాటో సైనిక కూటమిలో ఫాస్ట్ ట్రాక్ సభ్యత్వం కావాలని కోరారు. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. నాటోలో చేరానుకుంటే.. ముందుగా నాటోలో సభ్య దేశాలుగా ఉన్న 30 దేశాలు ఇందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. రష్యా భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్ వెనెడిక్టోవో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో చేరితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారు. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడు అయిన భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పెట్రుషేవ్ కు డిప్యూటీగా ఉన్నారు వెనెడిక్టోవ్. ఇటువంటి ఆత్మహత్య ప్రయత్నాలను నాటో దేశాలు అర్థం చేసుకున్నాయని అన్నారు. అణు యుద్ధం ప్రపంచానికి విపత్కర పరిణామాలను తీసుకువస్తుందని.. రష్యాపై నివారణ దాడులు చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పిలుపు ఇవ్వడం ప్రమాదకరమని వెనెడిక్టోవ్ అన్నారు. అణు వివాదం మొత్త ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. రష్యానే కాకుండా మొత్తం వెస్ట్రన్ దేశాలు, ఈ గ్రహం మీద ఉన్న అన్ని దేశాలు, మొత్తం మానవాళికి వినాశకరమైనవని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)