గుడ్డు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


అక్టోబర్ రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కోడి గుడ్డు గురించి అందరికీ తెలియాల్సిన కొన్ని అంశాలు. గుడ్డులో పౌష్టిక విలువలు చాలా ఉన్నాయి. అందుకే వైద్యులు సూచిస్తూ ఉంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వారంతా కోడిగుడ్డు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కూడా ప్రచారం చేశాయి. తద్వారా వైరస్ వంటి మహమ్మారిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని సూచనలు చేశాయి. దేశంలో కోడి గుడ్డు వినియోగం ఎక్కువగా ఉంటుంది. గుడ్డు కూడా వివిధ రూపాల్లో తీసుకుంటారు. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్లు తినడం అత్యధిక ప్రాంతాల్లో అలవాటు. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 క్యాలరీలు అందుతాయని పరిశోధనల్లో తేలింది. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. కోడి గుడ్డులోని ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. గుడ్డు తింటే ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన పోషకం. కంటి చూపు మందగించడం వంటి సమస్యలను అధిగమించేలా గుడ్డులో ఉండే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ వంటివి తోడ్పడతాయి. విటమిన్‌-డీ కూడా గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం అత్యధికులు విటమిన్‌-డీ లోపంతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు గుడ్డు మేలు చేస్తుంది. అమైనో ఆమ్లాలు అధికంగా శారీరక శ్రమ చేసిన వారు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఉపయోగపడతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)