అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని శశి థరూర్ అన్నారు . ఈ మేరకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి లేఖ రాశారు. ఒకవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న వేళ శశిథరూర్ ఈ వాఖ్యలు చేయడం ప్రాధన్యతను సంతరించకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ లో అవకతవకలు చోటుచేసుకున్న విషయన్ని మిస్త్రీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించామని కానీ ఫలితం లేకపోవడంతో లేఖ రాసినట్టుగా థరూర్ వెల్లడించారు. ఆ రాష్ట్రంలోని ఓట్లన్నింటినీ చెల్లనివిగా పరిగణించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లుగా థరూర్ తన లేఖలో తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కోనసాగుతోంది. ఏఐసీసీ కార్యాలయంలో అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ఎవరికైతే 50శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో..వారినే విజేతగా ప్రకటించనున్నారు. దేశ వ్యాప్తంగా ఈనెల 17న అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ నిర్వహించింది కాంగ్రెస్. ఆయా రాష్ట్రాల పీసీసీ కార్యాలయంలో పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 9వేల మంది డెలిగేట్స్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 24 ఏండ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తుల చేతుల్లోకి కాంగ్రెస్ పగ్గాలు వెల్లనుండటంతో కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)