బ్రిటన్‌ను వలసరాజ్యంగా మార్చుకోవాలి !

Telugu Lo Computer
0


రవి ఆస్తమించని సామ్రాజ్యంగా గొప్పగా చెప్పుకునే యునైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచానికి పార్లమెంటరీ వ్యవస్థను అందించిన దేశంగా పేరొందిన బ్రిటన్, ప్రస్తుతం తమను తాము పాలించుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గతంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని బాధ్యతు చేపట్టిన 45 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ సమయం పరిపాలించిన ప్రధానిగా చెత్త రికార్డ్ మూట కట్టుకున్నారు. మరోవైపు ఇంధన సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు భోజనాల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో సౌతాఫ్రికా కమెడియన్ ట్రేవర్ నోహ్ బ్రిటన్ పై చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆయన అన్న మాటలు ఇప్పుడు యూకే పరిస్థితికి సరిపోయేలా ఉన్నాయి. భారతదేశం, బ్రిటన్‌ను వలసరాజ్యంగా మార్చుకోవాలని సూచించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. గతంలో బ్రిటీష్ వలస రాజ్యంగా భారతదేశం ఉండేదని, అయితే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యూకేను భారత్ వలస రాజ్యంగా మార్చుకోవాలని ట్రేవర్ అంటారు. ఈ వీడియో 2019లో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే '' బ్రెగ్జిట్'' సమయంలో చేసింది. అయితే ఈ వీడియో 2022 యూకే పరిస్థితులకు సరిపోయేలా ఉన్నాయని నెటిజెన్లు అంటున్నారు. యూకే చాలా విషయాల్లో చాలా చెడ్డది అని, వారి పాత వలస దేశాలు బ్రిటన్ ను వలస దేశంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు ట్రేవర్ వీడియోలో చెబుతారు. '' భారత దేశం ఇంగ్లాండ్ వచ్చి చూడండి.. మిమ్మల్ని మీరు ఎలా పరిపాలించుకోవాలో మీకు తెలియదు, మేము దీన్ని పరిష్కరిస్తాము'' అంటూ ట్రేవర్ బ్రిటన్ పరిస్థితిని గురించి సెటైరికల్ కామెంట్స్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)