ఇప్పుడు ప్రయాణించండి - తర్వాత చెల్లించండి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 21 October 2022

ఇప్పుడు ప్రయాణించండి - తర్వాత చెల్లించండి !


'ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి'  సేవలను తాజాగా ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. ఇందుకోసం క్యాష్‌ఈ  సంస్థతో జట్టుకట్టింది. రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో ఈ సేవలు లభ్యమవుతాయి. ప్రయాణికులు ఇకపై టికెట్‌ బుక్‌ చేసుకున్నాక టికెట్‌ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చు. 6 లేదా 8 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నారు. సాధారణ, తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో క్యాష్‌ఈ ఈఎంఐ సేవలను పొందొచ్చు. యాప్‌ వాడే వారందరూ ఆటోమేటిక్‌గా ఈ సదుపాయాన్ని పొందొచ్చని, దీనికి ఎలాంటి డాక్యుమెంటేషన్‌ అవసరం లేదని క్యాష్‌ఈ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా కొంతమొత్తం చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం లేదా టికెట్‌ ధర మొత్తాన్నీ ఈఎంఐగా మార్చుకునే వీలుంది. మొత్తం, కాలవ్యవధి ఆధారంగా వడ్డీ రేటు వర్తిస్తుంది.

No comments:

Post a Comment