ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Telugu Lo Computer
0


ముంబయి ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి 16 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.80 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కి అందిన సమాచారం మేరకు అక్రమంగా హెరాయిన్ ను ఇండియాకు తీసుకువస్తుండగా ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న ఓ వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా అందులో ఏమీ కనిపించలేదు. వెంటనే అతడి ట్రాలీ బ్యాగ్ ను పూర్తిగా తనిఖీ చేయడంతో అందులో నకిలీ సిలో డ్రగ్స్ దొరికాయి. అక్రమంగా హెరాయిన్ ను తీసుకెళ్తున్నఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా ఓ విదేశీ పౌరుడు, డ్రగ్స్ ప్లెడర్ జాన్ కలిసి డ్రగ్స్ ఇచ్చారని చెప్పాడు. అందుకు కమీషన్ గా తనకు వెయ్యి అమెరికన్ డాలర్లు ఇచ్చారని డీఆర్ఐ అధికారులకు తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)