దుస్తులంటే చిరాకు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన కన్నయ్య అనే  యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకు. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని చెబితే, వారితో మాట్లాడడం మానేసేవాడు. పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు కన్నయ్య తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా, కన్నయ్య పట్టించుకోలేదు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యాక బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కన్నయ్యను చేర్పించేందుకు వెళితే యాజమాన్యం ప్రవేశం కల్పించలేదు. చివరకు కలెక్టర్‌ అనుమతి తీసుకున్న తర్వాతే ప్రవేశం లభించింది. కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన కన్నయ్య.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. ఉపాధ్యాయులు అందుకు అంగీకరించలేదు. చాలా శ్రమపడి కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య ఇంటర్‌ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్‌వేర్‌, పైనుంచి తువ్వాలు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించడు.

Post a Comment

0Comments

Post a Comment (0)