శివ కార్తికేయన్ "ప్రిన్స్"

Telugu Lo Computer
0


హీరో కార్తికేయన్ తెలుగులో నేరుగా ప్రిన్స్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జాతిరత్నాలు సినిమాతో మంచి విజయం అందుకున్న అనుదీప్ ప్రిన్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మారియా ర్యాబోషప్క అనే విదేశీ నటి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత, థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లీష్ అమ్మాయి ప్రేమ కథే ఈ సినిమా.  'ప్రిన్స్' మూవీని చూసిన తమిళ ప్రేక్షకులు దర్శకుడు అనుదీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'జాతిరత్నాలు వైబ్స్ 80 శాతం ఉన్నాయి. అనుదీప్ ట్రీట్‌మెంట్ వర్కౌట్ అయింది. సెకెండాఫ్‌లో 20 నిమిషాలు స్లోగా ఉన్నా అనుదీప్ వల్ల డీసెంట్ ఫిల్మ్‌గా మారిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)