ఢిల్లీలో బాణసంచాపై నిషేధం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 19 October 2022

ఢిల్లీలో బాణసంచాపై నిషేధం !


వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా రూ. 200 జరిమానా విధించటంతో పాటు, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్‌ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అక్టోబర్‌ 21న ' దీపాలు వెలిగించండి - పటాసులు కాదు' అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాయ్‌ చెప్పారు. వచ్చే శుక్రవారం సెంట్రల్‌ పార్క్‌ వద్ద 51 వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.


No comments:

Post a Comment