వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదు, హక్కులు కాపాడబడాలి !

Telugu Lo Computer
0


ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన ముంబైలో ప్రసంగిస్తూ ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, మహిళా రిపోర్ట్‌ర్లపై దాడులు అధికమైపోయాయి. మానవ హక్కుల మండలిలో ఎన్నుకోబడిన సభ్య దేశంగా భారత్‌కి ప్రపంచ మానవ హక్కులను రూపొందించడం, మైనారిటీ వర్గాల సభ్యులతో సహా అందరి హక్కులను రక్షించడం, ప్రోత్సహించడం వంటివి చేయాల్సిన బాధ్యత ఉంది. బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్ల భారత్‌లో సాధించిన విజయాలను గురించి కూడా ప్రశంసించారు. అలాగే భారత్‌లో వైవిధ్యం గొప్పగా ఉంటే సరిపోదని, హక్కులు రక్షింపబడాలి. అలాగే ద్వేషపూరిత ప్రసంగాలను నిర్ద్వద్వంగా ఖండించి విలువలను కాపాడుకోవాలి. మానవహక్కులను భారత న్యాయవ్యవస్థ నిరంతరం రక్షిస్తూ ఉండాలి. పునరుత్పాదక శక్తి కోసం లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ భారత్‌ మాత్రం 70 శాతం బొగ్గును వినయోగిస్తోంది. భారత్‌ వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ చర్యలు మరిన్ని తీసుకోవాలి. ఆరవ వంతు మానవాళి అధికంగా ఉన్న భారత్‌ 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తుందా ? లేక విచ్చిన్నం చేస్తుందా ? అని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)