కోతుల పేరుతో 32 ఎకరాల భూమి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో గ్రామస్తులు కోతులకు ఎంతో విలువ ఇస్తారు. ఇంటికి వచ్చిన కోతులకు ఆహారం ఇవ్వకుండా తిప్పిపంపరు. అలాగే వివాహం వంటి వేడుకల సందర్భంగా కోతులను ప్రత్యేకంగా గౌరవిస్తారు. వాటికి తొలి కానుక ఇచ్చిన తర్వాతే పెళ్లి తంతు ప్రారంభిస్తారు. అంతగా కోతులను ఆదరించే ఈ గ్రామంలో ఏకంగా వాటి పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామ సర్పంచ్‌ బప్పా పడ్వాల్‌ స్వయంగా ఈ విషయాన్ని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆ భూమి కోతులకు చెందినట్లుగా పత్రాల్లో స్పష్టంగా ఉందని చెప్పారు. కోతుల పేరుతో భూమిని ఎవరు రిజిష్టర్‌ చేశారో తెలియదని అన్నారు. కోతులకు చెందిన ఆ భూమిలో అటవీశాఖ అధికారులు చెట్లు నాటినట్లు గ్రామ సర్పంచ్‌ బప్పా పడ్వాల్‌ తెలిపారు. ఆ స్థలంలో ఒక పాడుబడిన ఇల్లు కూడా ఉందన్నారు. తమ గ్రామంలో సుమారు వంద వరకు కోతులు ఉండేవని, అయితే రానురాను వాటి సంఖ్య చాలా తగ్గిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)