ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్‌ఖేరీ  దగ్గర ప్రైవేటు బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 25 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సు ధౌరేహ్రా నుంచి లక్నో వెళుతుండగా ఇసానగర్ పోలీస్ స్టేషన్  పరిధిలో ఎరా వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోకు రిఫర్ చేసినట్లు లఖింపూర్ ఖేరీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్సంజయ్ కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న ఏడీఎం, సర్కిల్‌ అధికారి జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. "లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సంతాపం తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారికి చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని యోగి సీనియర్ అధికారులను ఆదేశించారు" అని సీఎంఓ ట్వీట్ చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు యోగి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యోగి ఆకాంక్షించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)