లతామంగేష్కర్ కు యూపీ సర్కార్ ఘన నివాళి

Telugu Lo Computer
0



ప్రముఖ సింగర్ లతామంగేష్కర్ కు యూపీ సర్కార్ ఘన నివాళి అర్పించింది. అయోధ్యలోని లతామంగేష్కర్ చౌక్ దగ్గర 14 టన్నుల బరువున్న 40 ఫీట్ల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్ గా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. నగరంలోని రామ్ కథా పార్క్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోనే ఇంత పెద్ద సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ తయారు చేశారు, దీని తయారీకి రెండు నెలల సమయం పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న లతామంగేష్కర్ అనారోగ్యంతో మరణించారు. 1929లో జన్మించిన లతా మంగేష్కర్ పరిచయం , కోరా కాగజ్ , లేకిన్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)