ఇండోస్పిరిట్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రు అరెస్ట్

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సమీర్ మహేంద్రు ఏ5 నిందితుడిగా ఉన్నారు. రాధా ఇండ్రస్ట్రీస్ కు చెందిన యూకో బ్యాంక్ ఖాతాకు సమీర్ మహేంద్రు రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో నిర్ధారణ కావటంతో సమీర్ ను అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలన అరెస్ట్ జరిగింది. లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న మహారాష్ట్రకు చెందిన వ్యాపారి విజయ్ నాయర్ తో పాటు ఇండో స్పిరిట్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఓన్లీ మచ్ లౌడర్ మాజీ సీఈవో విజయ్ నాయర్ ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే సమీర్ ను కూడా అరెస్ట్ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ ఎంత దూకుడుగా ఉందో అర్థమవుతోంది. ఈ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15మందిని నిందితులుగా పేర్కొన్న క్రమంలో ఇంకెంతమంది వెలుగులోకి వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని జోర్ బాగ్ లో నివాసం ఉంటుంన్న సమీర్ మహేంద్రును సీబీఐ గత ఆగస్టులో విచారించింది. ఈ స్కామ్ లో ఆయనపై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించింది. సమీర్ మహేంద్రు రూ.కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లుగా గుర్తించటంతో డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు దినేష్ అరోరా అత్యంత సన్నిహితుడైనందున ఈ డబ్బు ఆయన కోసమేననే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. దీంతో పాటు ఎన్నలీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయర్ తరపున సుమారు రూ.4కోట్ల రూపాయలను అర్జున్ పాండేకు అందజేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. మనీష్ సిసోడియాకకు అర్జున్ పాండే అత్యంత సన్నిహితుడనే గుర్తింపు ఉంది. అలాగే హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై కూడా విజయ్ నాయర్ ద్వారా సమీర్ మహేంద్రు నుంచి భఆరీ మొత్తంలో ముడుపులు అందుకున్నట్లుగా అధికారులు అనుమానించి గత ఆగస్టులో విచారణ చేశారు. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. పెద్ద పెద్ద వ్యక్తులే వెలుగులోకి వస్తున్నారు. ఇక విచారణ కొనసాగుతున్న క్రమంలో ఇంకెంతమంది నిందుతులుగా ఈ స్కామ్ లో వెలుగులోకి వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)