బీజేపీ వాళ్లవి బట్టేబాజ్ మాటలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 3 August 2022

బీజేపీ వాళ్లవి బట్టేబాజ్ మాటలు !


కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ బీజేపీపై, కోమటి రెడ్ది రాజగోపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ వాళ్లు బద్మాష్ కొడుకులు, బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్మాష్ మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ వాళ్లు దొంగ రామ భక్తులని, అసలైన భక్తులం మేమే అని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. మోదీ దేవుడన్న సంజయ్, తెలంగాణకు మీ దేవుడు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిన సంస్థల్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. బండి సంజయ్ పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఏం చేశావని ప్రశ్నించారు. రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది.. దాన్ని ఎవరూ ఖతం చేయలేరని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయారని చెబుతున్న రాజగోపాల్ రెడ్డిని నువ్వేం చేశావని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్ది పాత రికార్డులు తిప్పడం.. ఫోజులు కొట్టడం కాదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎలా ఎంపీ అయ్యావని అన్నారు. వైఎస్ఆర్ ఆఖరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని .. మరి నువ్వేం అంటున్నావని.. కాంగ్రెస్ పార్టీని శవం అంటున్నావు.. శవం దగ్గర ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ సానుభూతితో గెలిచి ఎక్కువగా మాట్లాడుతున్నాడని.. బీజేపీలోకి పోయి మాకు నీతులు చెబుతున్నావా..? అని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ కానీ.. ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీని అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

No comments:

Post a Comment