అమెజాన్, కాగ్నిజెంట్ ఆఫర్లను కాదని మైక్రోసాఫ్ట్ ను ఎంచుకున్న మధుర్ !

Telugu Lo Computer
0


హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మధుర్ రఖేజాదీకి  మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి రూ.50 లక్షల జాబ్ ఆఫర్ వచ్చింది. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ జాబ్ ఆఫర్ రాకముందే అతడు అమెజాన్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల ఆఫర్లను తిరస్కరించాడు. మధుర్ రఖేజా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అతను యుపిఈఎస్ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్‌లో స్పెషలైజేషన్‌తో పూర్తి చేశాడు. ఈయన తండ్రి చిన్న దుకాణం నడుపుతుండగా తల్లి గృహిణి. తనకు టెక్నాలజీపై మక్కువ ఉందని, ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జీవితాలను చేసే శక్తి దానికి ఉందని అతను అన్నాడు. అప్‌స్ట్రీమ్ పెట్రోలియం ఇంజినీరింగ్‌కు వెళ్లమని తనకు సూచించారని చెప్పాడు. కానీ  దానిలో వృత్తి గురించి ఖచ్చితంగా తెలియదని అన్నాడు. 'కంప్యూటర్ సైన్స్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలైజేషన్ కూడా ఉందని అప్పుడు తెలిసింది' అని చెప్పాడు. ఈ ప్లేస్‌మెంట్ సెషన్‌లో యుపిఈఎస్ తమకు చాలా మంచి అవకాశాలను అందించిందని వెల్లడించాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా మైక్రోసాఫ్ట్ నుంచి భారీ ప్యాకేజీని కొట్టేశాడు. మైక్రోసాఫ్ట్ కాకుండా మాధుర్ కు.. డిఇ షా, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మొదలైన అనేక కంపెనీలకు క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రెండింటినీ దరఖాస్తు చేసుకున్నాడు. వాటిలో మైక్రోసాఫ్ట్, ఆప్టమ్, కాగ్నిజెంట్, అమెజాన్ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ మెక్రోసాఫ్ట్ ను ఎంచుకున్నాడు. తన నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని రాఖేజా చెప్పాడు. మైక్రోసాఫ్ట్‌లో పని గంటలు అనువుగా ఉంటాయి. అక్కడ వర్క్ కల్చర్ చాలా బాగుంది. అక్కడ ఇంజనీర్లు చేసే పని చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కంపెనీ తన ఉద్యోగుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మైక్రోసాఫ్ట్‌లోని ఉద్యోగులు తమ హాబీలు, ఆసక్తులను సులభంగా కొనసాగించవచ్చని తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)