మా కారు కొని మమ్మల్ని ఆశీర్వదించింది మీరే !

Telugu Lo Computer
0


అశోక్‌ కుమార్‌ అనే ట్విటర్‌ యూజర్‌ తాజాగా మహీంద్రా XUV700ని కొనుగోలు చేశారు. ఈ ఆనందాన్ని మహీంద్ర చీఫ్‌తో పంచుకోవాలనుకున్నారు. మహీంద్ర ఎస్‌యూవీతో ఫోటోను పోస్ట్‌ చేస్తూ.."10 సంవత్సరాలు కష్టపడి కొత్త మహీంద్రా XUV 700ని కొనుగోలు చేశా.. సార్ మీ ఆశీర్వాదం కావాలి."అంటూ ఆ పోస్ట్‌ను ఆనంద్‌ మహీంద్రకు ట్యాగ్ చేశారు. దీనికి ఆనంద్‌ మహీంద్ర స్పందిస్తూ "ధన్యవాదాలు, కానీ వాస్తవానికి మా కంపెనీ కారు ఎంచుకుని మమ్మల్ని ఆశీర్వదించినది మీరే! కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అంటూ ట్వీట్ చేశారు. దీంతో స్పందనగా అశోక్‌కుమార్‌ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందంటూ అశోక్‌కుమార్‌కి అభినందనలు తెలిపారు. అలాగే ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు. 'మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి' అని ఒ​క యూజర్‌ కామెంట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)