పడిపోయిన టమోటా ధరలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ లో వాతావరణం అనుకూలించడంతో రైతులు టమోటా బాగా పండించారు. దీంతో ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి. మే వరకు కిలో రూ.30 వరకు విక్రయించిన టమాటా ప్రస్తుతం మార్కెట్‌లో చిల్లరగా రూ.12కు విక్రయిస్తున్నారు. అయితే దళారులు మాత్రం కిలో రూ.3కే రైతులకు అందిస్తున్నారు.  దీంతో చాలా నష్టం జరుగుతోందని, టమాటాలు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది టమోటాకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 5 ఎకరాల్లో సాగు చేశానని, రోజూ 60 కిలోల టమోటాలు పండుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన ఓ రైతు తెలిపారు. కిలో టమాట రూ.6 వస్తుందని.. మార్కెట్‌లో రూ.3 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. దీని పైన రవాణా ఖర్చు కూడా ఉంటుందని అన్నారు.  తాము చేసిన ఖర్చులో సగం కూడా సంపాదించడం లేదని... అందుకే ఇప్పుడు తన పశువులకు టమోటాలు తినిపించాలని నిర్ణయించుకున్నానని వాపోయాడు. మార్కెట్‌లో సరైన ధర లభించకపోవడంతో టమోటాలను విక్రయించేందుకు నిరాకరించి చెత్తకుప్పల్లో విసిరి నిరసన తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కొందరు రైతులు సొంతంగా స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నేరుగా వినియోగదారులకే విక్రయిస్తూ టమాటకు మంచి ధర లభిస్తోంది. అయితే ఇలా చేయడం ద్వారా, రైతులు మొత్తం ఉత్పత్తిలో కొద్ది భాగాన్ని మాత్రమే వినియోగదారులకు విక్రయించగలుగుతున్నారు. టమోటాల పరిస్థితి చూసి చాలా మంది రైతులు పంటను సాగు చేయడం మానేస్తున్నారని, దీంతో రానున్న కాలంలో వాటి రాక తగ్గి మళ్లీ ధరలు ఎగబాకుతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అక్టోబరు నుంచి పండుగల సీజన్‌ ప్రారంభమవుతుందని, ఆ తర్వాత టమోటాకు డిమాండ్‌ పుంజుకుంటుందన్నారు. అటువంటి పరిస్థితిలో పంట తగ్గుదల కారణంగా, దాని ధరల్లో పెరుగుదల ఉంటుందని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)