మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Telugu Lo Computer
0


మంకీపాక్స్ కేసులు పెరిగిపోతోన్న వేళ దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. మంకీపాక్స్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మంకీపాక్స్‌పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంకీపాక్స్ గురించి ప్రజలు తెలుసుకోవడం తప్పనిసరి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే తాము నీతి ఆయోగ్ సభ్యుడు చైర్మన్‌గా మంకీపాక్స్‌పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. కేరళలో మొదటి కేసు నమోదు కాకముందు కూడా తాము మంకీపాక్స్‌పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని ఆయన గుర్తు చేశారు. ఎవరికైనా మంకీపాక్స్ సోకితే అతడిని 12-13 రోజులు ఐసోలేషన్‌లో ఉంచాలని అన్నారు. కేరళలో మంకీపాక్స్ తొలి కేసు నమోదైన వెంటనే తాము నిపుణుల బృందానికి ఆ రాష్ట్రానికి పంపామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)