3న బెంగాల్‌ మంత్రివర్గ విస్తరణ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 August 2022

3న బెంగాల్‌ మంత్రివర్గ విస్తరణ !


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం బెంగాల్ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ తేదీని ప్రకటించారు. బుధవారం మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, కనీసం నలుగురు కొత్త ముఖాలను కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉందని ఆమె సూచనప్రాయంగా చెప్పారు. స్కూల్ ఉద్యోగాల కేసులో పార్థా ఛటర్జీని, అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసి విషయం విధితమే. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి పదవి నుండి పార్థా ఛటర్జీని సస్పెండ్ చేశారు. ఈ ఘటన తరువాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు మమత నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 4గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ముందని, నాలుగురు లేదా ఐదుగురు కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోవటం జరుగుతుందని వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ పార్థా ఛటర్జీ పేరును కూడా ప్రస్తావించారు. మొత్తం మంత్రి వర్గాన్ని రద్దు చేసి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచన మాకు లేదని అన్నారు. మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అన్నారు. మంత్రులు సబ్రతా మఖర్జీ, సాధన్ పాండేలను కోల్పోయామని, పార్థా ఛటర్జీ జైలులో ఉన్నారని కాబట్టి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. ఇది నేను ఒంటరిగా నిర్వహించడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. బెంగాల్ లో ఏడు కొత్త జిల్లాల గురించి కూడా మమతా బెనర్జీ ప్రస్తావించారు. మొత్తం జిల్లాల సంఖ్యను 23 నుంచి 30కి పెంచటం జరుగుతుందని అన్నారు. ఏడు కొత్త జిల్లాల్లో సుందర్‌బన్, ఇచ్చెమటి, రణఘాట్, బిష్ణుపూర్, జంగీపూర్, బెహ్రాంపూర్ తో పాటు మరో జిల్లాకు బసిర్హాట్ అని పేరు పెట్టడం జరుగుతుందని ఆమె అన్నారు.

No comments:

Post a Comment