భార్య పట్ల భర్త అకృత్యం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 1 August 2022

భార్య పట్ల భర్త అకృత్యం !


హైదరాబాద్ లోని శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి (35) 2016లో మహిళ (27)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో రూ.5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు, లక్షల విలువైన ఇతరత్రా గృహోపకరణాలు తీసుకున్నాడు. కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా భార్యతో ప్రమాణం చేశాడు. కొన్నేళ్లలోనే అవన్నీ మర్చిపోయాడు. ఇటీవల కొంత కాలంగా ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం ప్రారంభించాడు. ఖర్చులకు డబ్బు లేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరక్కపోయే సరికి.. పడక గదిలో భార్య అశ్లీల దృశ్యాలను తన చరవాణిలో ఆమెకు తెలియకుండా రికార్డు చేసి సోషల్‌ మీడియా ద్వారా స్నేహితుడికి పంపించాడు. భర్తను నిలదీయగా.. తన స్నేహితుడితో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేశాడు. జరిగిన ఘోరాన్ని అత్త, మామల దృష్టికి తీసుకెళ్లగా కుమారుడు చేసిన నిర్వాకాన్ని సమర్థించి అదనపు కట్నం తేవాలని హెచ్చరించారు. పైగా భర్త బంధువులు దాడి చేసి పుట్టింటికి పంపించారు. వేదన భరించలేక ఆమె శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించగా.. భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు. 

No comments:

Post a Comment