అత్యాచారం నుంచి యువతిని కాపాడిన హిజ్రాలు !

Telugu Lo Computer
0


బెంగుళూరులోని కేఆర్ పురంలోని వివేక్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కోరమంగళం వద్ద ఉన్న ఈజిపురలో మిజోరాం కు చెందిన ఒక యువతి నర్సింగ్ కోర్సు చేస్తూ నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మసురుల్ షేక్ అనే యువకుడు యువతిపై కన్నేశాడు. ఒక హోటల్ లో పని చేసే మసురుల్ షేక్ ఆమెను ఏడిపించడానికి ఆమె ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ రోజూ నొక్కి పారిపోయేవాడు. తలుపు తీసుకుని చూస్తే ఎవరూ కనపడకపోయే సరికి ఆ యువతి మళ్లీ తలుపు వేసుకుని లోపలకు వెళ్లిపోయేది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా కాలింగ్ బెల్ నొక్కాడు. ఆమె డోర్ తీయగానే ఆమెను నెట్టుకుంటూ లోపలకు వెళ్లి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. భయంతో ఆమె కేకలు వేసింది. ఆమె కేకలు విని అక్కడకు దగ్గరలోనే ఉన్న ఇద్దరు హిజ్రాలు వచ్చి యువతిని రక్షించి, ఆ యువకుడిని పట్టుకున్నారు. స్ధానికులు వచ్చి యువకుడికి దేహశుధ్ది చేసి పోలీసులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)