గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

గన్ పెట్టి మొబైల్ కొట్టేశాడు !


ఓ రద్దీ రోడ్డుపై వాహనాలు జోరుగా వెళుతున్నాయి. రోడ్డు పక్కనే కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉండగా, వాటి ముందు ఓ వ్యక్తి కుర్చీలో కూర్చుని తన మొబైల్‌తో ఆడుకుంటూ ఉంటాడు. ఎడమ సైడ్ ఓ కుర్రాడు కూడా ఉంటాడు. ఇంతలో ఓ దొంగ మొహానికి ముసుగు వేసుకుని వచ్చి కుర్చీలో కూర్చున్న వ్యక్తిని దాటుకుంటూ వెళతాడు. ఇదేమీ పట్టించుకోని అతడు మొబైల్‌ చూస్తూ ఉంటాడు. వెనక్కి వచ్చిన దొంగ దాచుకున్న గన్ తీసి  మొబైల్ ఇవ్వమని బెదిరిస్తాడు. ఒక్కసారిగా షాక్ తిన్న అతడు మొబైల్ ఇచ్చేస్తాడు. ఇది గమనించిన పక్కనే ఉన్న కుర్రాడు ముందు వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో మొబైల్ తీసుకున్న దొంగ కుర్రాడి వైపు తిరగ్గానే గన్ కనిపించడంతో వెనక్కి తగ్గుతాడు. ఆపై దొంగ కాల్చినా అతడికి ఏమి కాదు. ఇంతలో మరో అతను బైక్ వేసుకుని రాగా, సదరు దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే దొంగ దగ్గర ఉంది బొమ్మ తుపాకీ అన్నమాట. ఈ వీడియోను superautovip అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. బొమ్మ తుపాకీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి.

No comments:

Post a Comment