దురదృష్టవశాత్తు ఇండస్ట్రీకి దూరమయ్యా !

Telugu Lo Computer
0


డైరెక్టర్ ప్రదీప్ వర్మ డైరెక్షన్లో వస్తున్న అల్లూరి సినిమా ని బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా అల్లూరి సినిమా టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.. ఈవెంట్లో పాల్గొన్న శివాజీ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అల్లూరి అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తారని ప్రతి భారతీయుడిలా దేశభక్తిని కలిగించిన చిత్రం అది అని తెలిపారు. అల్లూరి సినిమా నిర్మాత గోపి చాలామందిని పరిచయం చేశారు కానీ.. నేను గోపిని పరిచయం చేశానని చాలా ధైర్యంగా చెబుతాను ఎందుకంటే గోపి సినిమా మీద అభిమానంతో ఆయన అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు రావడం జరిగింది. ఇండస్ట్రీలో అనుకోకుండా ఒక రోజు చీకటి రోజు తను కలిశాడని.. నేను ఆ టైంలో చీకట్లోనే ఉన్నానని తర్వాత ఇద్దరం చీకటి నుంచి వెలుతురు లోకి వచ్చి గోపి చెప్పిన ప్రతి కథ తనకు చెప్పాడని తెలిపారు. అలా ఆయన చెప్పిన కథలు కొన్ని వందలు ఉన్నాయి కానీ నేను వద్దని చెప్పాను. నేను నాన్న బాయ్ ఫ్రెండ్ అనే సినిమాని చేశాడు ఆ సినిమా మిస్ఫైర్ అయింది రీసెంట్గా అల్లూరి అనే సినిమా కథను చెప్పారు ధైర్యంగా గుండెలపైన చేయి వేసుకొని ఈ సినిమా చేయొచ్చని తెలిపారని తెలిపారు. పోలీస్ కథలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అవుతాయి.. అందుచేతనే అల్లూరు జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తన కెరియర్ లో చివరి సినిమా బూచమ్మ బూచోడు. అప్పటినుంచి నేను సినిమాలు చేసుకునే ఉంటే ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే వాడిని కానీ దురదృష్టవశాత్తు ఇండస్ట్రీకి దూరమయ్యాను అని  శివాజీ చాలా బాధపడ్డాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)