దేవుడు బొమ్మ ఉండటమే అతని పాపమైంది ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 5 July 2022

దేవుడు బొమ్మ ఉండటమే అతని పాపమైంది !


ఉత్తరప్రదేశ్ లోని సంభల్‌ పట్టణం. చికెన్‌ సెంటర్‌ను నడిపే తాలిబ్‌ హుస్సేన్‌ రోజూలాగే ఆదివారం కోడిమాంసాన్ని అమ్ముతున్నాడు. కస్టమర్లకు మాంసాన్ని న్యూస్‌ పేపర్‌లో చుట్టి అందిస్తున్నాడు. అయితే, ఓ వ్యక్తికి మాంసం అమ్మిన పేపర్‌లో దేవుడి బొమ్మ ఉండటం అతడి పాపమైంది. దీంతో తమ మతాన్ని, మనోభావాలను కించపరిచాడని ఓ వర్గం వారు రెచ్చిపోయారు. హుస్సేన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్యుత్సాహం ప్రదర్శించిన యూపీ పోలీసులు హుస్సేన్‌పై ఐపీసీ సెక్షన్‌ 153-ఏ (మతాలమధ్య చిచ్చు), 295 ఏ (ఇతర మతాలను అవమానించడం) కింద కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా చేశారు. అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన తమపై హుస్సేన్‌ కత్తితో దాడికి యత్నించాడని ఆరోపిస్తూ సెక్షన్‌ 307 (హత్యాయత్నం) కింద కూడా కేసు నమోదు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మత జాఢ్యం విశృంఖలంగా పెరిగిపోయిందనడానికి తాజా ఘటనే ఉదాహరణ అని నెటిజన్లు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment