కరివేపాకు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వంటకాలల్లో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తాం. కరివేపాకుతో ఏదైనా ఆహారపు రుచి, సువాసన మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇళ్లలో కరివేపాకు మొక్కలను  పెంచుకుంటుంటారు. ఈ కరివేపాకులతో పలు రకాల వంటకాలతోపాటు.. చట్నీ కూడా చేసుకొని తింటారు. కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది. కరివేపాకు ఆకులను తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. కరివేపాకులో చూపును మెరుగుపరిచే ముఖ్యమైన పోషకం విటమిన్ ఎ ఇందులో ఉంది. ఇది రేచీకటీ లేదా కంటికి సంబంధించిన అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం రోగులు రోజూ తింటే చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. కరివేపాకును నమిలి తినడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)