నిర్లక్ష్యం ప్రాణం తీసింది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 29 July 2022

నిర్లక్ష్యం ప్రాణం తీసింది !


మహారాష్ట్ర లోని ముంబై, పస్కల్ వాడి ప్రాంతంలో రేఖా నిషద్ అనే మహిళ తన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపాలనుకుంది. దీని కోసం ఈ నెల 21న కొన్ని టమాటాలకు ఎలుకల మందు కలిపి వంట గదిలో ఉంచింది. ఆ మరుసటి మ్యాగీ నూడిల్స్ చేసుకుని తినాలనుకుంది. టీవీ చూస్తూ వంట చేయడం వల్ల పొరపాటున ఎలుకల మందు కలిపిన టమాటాల్ని మ్యాగీలో వేసేసింది. ఆ తర్వాత అవే నూడిల్స్ తిన్నది. కొన్ని గంటల తర్వాత వాంతులు మొదలయ్యాయి. అప్పుడు విషయం అర్థం కావడంతో భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment