సింధుకు సింగపూర్ ఓపెన్ టైటిల్

Telugu Lo Computer
0


పీవీ సింధూ సింగపూర్ ఓపెన్-2022 ఉమెన్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్‌ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్‌లో దారుణంగా ఓడిపోయింది. తర్వాత చివరిదైన మూడో గేమ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది. పురుషుల విభాగంలో 2017లో సాయి ప్రణీత్ కూడా గెలుపొందాడు. ఈ ఏడాది ఇది సింధు గెలిచిన మూడో టైటిల్ కాగా, మొదటి సూపర్-500 టైటిల్. ఇంతకుముందు గెలిచిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్.. రెండూ సూపర్-300 టైటిళ్లే. వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్ మెడల్స్‌తో కలిపి ఇది సింధు తన కెరీర్లో సాధించిన 18వ టైటిల్. సింధు సాధించిన ఈ విజయం ఈ నెల 28న బర్మింగ్‌హమ్‌లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్‌కు మరింత స్ఫూర్తినిస్తుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)