తిరుమలలో యూపీఐ చెల్లింపులు

Telugu Lo Computer
0


 టీటీడీ తిరుమలలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు తీసుకునే గదుల అద్దె, డిపాజిట్‌ మొత్తాన్ని చెల్లించేందుకు నగదు, ఏటీఎం కార్టులతో పనిలేకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు శ్రీకా రం చుట్టింది. ఈ విధానం ద్వారా గదులు ఖాళీ చేసిన తర్వాత తమ డిపాజిట్‌ సొమ్ము కోసం భక్తులు రోజుల తరబడి నిరీక్షించే సమస్య తొలగిపోయింది. తిరుమలలో భక్తుల కోసం దాదాపు 7 వేలకుపై గదులున్నాయి. గతం లో గదిని పొందే సమయంలో అద్దెతో పాటు అంతే సొమ్ము డిపాజిట్‌గా చెల్లించేవారు. గదిని ఖాళీ చేసిన తర్వాత తిరిగి డిపాజిట్‌ మొత్తాన్ని పొందేవారు. అయితే డిపాజిట్‌ను తిరిగి పొందే సమయంలో భక్తులు సమస్య లు ఎదుర్కొనేవారు. డిపాజిట్‌ రీఫండ్‌ కేంద్రాల నుంచి నగదు పొందడం, ఆ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో వెతు క్కుంటూ వెళ్లడం వంటి సమస్యతో పాటు కంప్యూటర్లు మొరాయించిన సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. టీటీడీ నాలుగు రోజుల నుంచి యూపీఐ అమలు చేస్తోంది. భక్తులు గదిని ఖాళీ చేసిన వెంటనే వారి ఖాతాకు ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచే నేరుగా తిరిగి డిపాజిట్‌ అందుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)