శివసేన నుంచి షిండే బహిష్కరణ

Telugu Lo Computer
0


శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నూతన సీఎం ఏక్ నాథ్ షిండే ను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు శివసేన నుంచి బహిష్కిరస్తున్నట్లు ఓ అధికారిక లేఖ ద్వారా ఠాక్రే షిండేకు తెలియజేశారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడినందుకుగానూ స్వచ్ఛందంగా షిండే తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై పార్టీలోని ఏ పదవిలోనూ ప్రాథమిక సభ్యత్వంతో సహా ఆయన ఉండబోరని లేఖలో ఠాక్రే వెల్లడించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. మంత్రి వర్గంలో ఏక్ నాథ్ షిండే కూడా కొనసాగారు. అయితే శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం శివసేన నుంచి గత ఎన్నికల్లో విజయంసాధించిన ఎమ్మెల్యేలు అధిక శాతం మంది షిండే వెంటే ఉన్నారు. ఈ క్రమంలో అసలైన శివసేన తమదేనంటూ ఇటీవల షిండే ప్రకటించారు. దీనికితోడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బాల్‌థాక్రేకు తానే నిజమైన రాజకీయ వారసుడిగా పేర్కొంటూ పరోక్షంగా శివసేన మాదే అంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌లో ప్రొఫైల్‌లో బాల్ ఠాక్రేతో కలిసిఉన్న ఫోటోను షిండే ఉంచారు. అయితే శివసేన చీఫ్ ను నేనే అని షిండే ప్రకటించుకోలేదు. దీంతో సాంకేతికంగా ఇప్పటికీ ఉద్దవ్‌ ఠాక్రేనే శివసేన అధినేతగా కొనసాగుతున్నారు. ఈ సమయంలో షిండేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉద్ధవ్ ప్రకటించిన నేపథ్యంలో షిండే వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)