స్పైస్‌జెట్ కి తప్పిన పెను ప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు నడుపుతున్న స్పైస్‌జెట్ విమానం 5000 అడుగులు దాటిన సమయంలో లావెటరీ స్మోక్ అలారం మోగినప్పుడు క్యాబిన్‌లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. క్యాబిన్ సిబ్బంది వెంటనే కాక్‌పిట్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు పరిశీలించగా పొగలు వ్యాపించినట్లు కనిపించలేదు. దీంతో స్సైస్ జెంట్ విమానం మరింత పైకి వెళ్లడంతో క్యాబిన్‌లో పొగ కమ్ముకుంది. అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో దట్టమైన పొగ వ్యాపించినట్లు వీడియోలో కనిపించింది. మూడు నెలల్లో స్పైస్ జెట్ విమానాల్లో ఇది ఏడో ప్రమాద ఘటన. ఇటీవల జబల్‌పూర్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో క్యాబిన్ ఒత్తిడి తగ్గడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సంఘటన జరిగిన మరో 12 గంటల్లో పక్షి ఢీకొనడంతో ఇంజన్‌లో పొగ, మంటలు రావడంతో మరో స్పైస్‌జెట్ విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 185 మంది ప్రయాణికులు ఉండగా, వారందరినీ సురక్షితంగా తరలించారు. విమానాన్ని పక్షి ఢీకొట్టిందని ప్రైవేట్ ఎయిర్‌లైనర్ ప్రకటన విడుదల చేసింది. ల్యాండింగ్ తర్వాత మూడు ఫ్యాన్ బ్లేడ్‌లు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలిందని స్పైస్‌జెట్ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)